మూలస్థానం లంక భూమిలో పట్ట పగలు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అదే విషయాన్ని ఆలమూరు ఎమ్మార్వో గారి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి వీ అర్ ఓ లను ఆ విషయంగా విచారించడానికి మూలస్థానం పంపిస్తానని మాట ఇచ్చారు. మూల స్థానం లంక భూమినుంచి ఈ దౌర్జన్యం ఏంటో మాకు అయితే అర్థం కావడం లేదు అని అక్కడి ప్రజలు వాపోయారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా? అనే ప్రశ్న అందరి మనసులలోను ఉదయిస్తుంది.లంక భూములను చెరువు రూపంలో మార్చేస్తారా? ఇదే ధోరణి కొనసాగితే గోదావరి వరదలు సమయములో మూలస్థానం చొప్పెల్ల లో ఏటిగట్టు తెగిపోయి త్వరలో ప్రాణనష్టం జరగబోతుంది.అధికారులరా ఆ విషయాన్నిగుర్తించి మీరు చర్యలు తీసుకుని ఆ చుట్టుపక్కల వారిని కాపాడవలసినదిగా అక్కడి ప్రజలందరూ కోరుకుంటున్నారు..