రాజకీయం (Politics)

తమిళిసై సేవాభావం‌.. ఇక రాజ్‌భ‌వ‌న్‌లో పేద‌ల‌కు అన్నం

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రాజ్‌భ‌వ‌న్ ఆధ్వ‌ర్యంలోనే సేవా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించనున్నారు. రాజ్ భ‌వ‌న్ అన్నం పేరుతో రాజ్ భ‌వ‌న్‌లో ఒక క్యాంటీన్ ఏర్పాటుచేశారు. ఇవాళ గ‌వ‌ర్న‌ర్ ఈ క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాది పూర్తైన సంద‌ర్భంగా త‌మిళిసై ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.

రాజ్ భ‌వ‌న్ క‌మ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్‌లో ప్ర‌తీ రోజూ పేద‌ల‌కు ఉచితంగా టిఫిన్ పెట్ట‌నున్నారు. మ‌ధ్యాహ్నం, రాత్రి నామ‌మాత్ర‌పు ధ‌ర‌ల‌కే భోజ‌నాన్ని అందించ‌నున్నారు. ప్ర‌తీ రోజూ సుమారు 500 మందికి రాజ్‌భ‌వ‌న్ అన్నం పెట్టాల‌ని నిర్ణ‌యించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.