పేద, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ – ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్

పామర్రు నియోజకవర్గం, తోట్లవల్లూరు మండలం, పెనమకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి నాందేటి దీపిక గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొని కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల రాజ్యాధికారం కోసం పార్టీ స్థాపించారని, అదే బాటలో గౌ, నారా చంద్రబాబు గారు పార్టీని నడిపిస్తున్నారని, అలాగే మీ అందరికి సేవ చెయ్యాలనే మంచి ఆలోచనతో ఈ రోజు దీపిక మీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిందని, మీరందరూ దీపికను ఆదరించి, మీ యొక్క ఆశీర్వదాలు అందించి, కత్తెర గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నానని రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వీరపనేని శివరాం, తలశిల శ్రీనివాస్ ప్రసాద్, చిగురుపాటి సుబ్రహ్మణ్యం, వల్లూరి కిరణ్, పరశురామ్, రెడ్డియ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.