రాజకీయం (Politics)

వాలంటీర్ల మెరుపు ధ‌ర్నాలు.. డిమాండ్లు ఇవే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాన‌సపుత్రిక లాంటిది వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నేరుగా గ‌డ‌ప వ‌ద్ద‌కే చేర‌వేసేందుకు ఆయ‌న ఈ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్ర‌తీ 50 ఇళ్ల‌కు ఒక వాలంటీర్ చొప్పున ల‌క్ష‌ల సంఖ్య‌లో గ్రామ‌, వార్డు వాలంటీర్‌ల‌ను నియ‌మించారు. ఏడాదిన్న‌ర‌గా వాలంటీర్లు ప‌ని చేస్తున్నారు. కొన్ని చిన్న సంఘ‌ట‌న‌లు మిన‌హా వాలంటీర్ల వ్య‌వ‌స్థ బాగా ప‌ని చేస్తోంద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లోనూ ఉంది.

వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పైన ప్ర‌భుత్వం కూడా సంతృప్తిగా ఉన్న వేళ ఊహించ‌ని షాక్ త‌గిలింది. వాలంటీర్లు ఆందోళ‌న‌ల బాట ప‌ట్టారు. నిన్న స‌మావేశ‌మైన గ్రామ‌, వార్డు వాలంటీర్లు ఇవాళ రాష్ట్ర‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు ప్రారంభించారు. త‌మ‌కు ఇస్తున్న రూ.5 వేల వేత‌నంతో జీవించ‌లేమ‌ని, రూ.12 వేల వేత‌నం ఇవ్వాల‌ని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.

తమ‌ను సంవ‌త్స‌రానికి ఒక‌సారి రెన్యువ‌ల్ చేసే విధానం వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, త‌మకు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరుతున్నారు. ఈఎస్ఐ సౌక‌ర్యం సైతం క‌ల్పించాల‌ని డియాండ్ చేస్తున్నారు. ఆందోళ‌న చేస్తున్న వాలంటీర్లు అంతా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫోటో పెట్టుకొనే ఆందోళ‌న‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. కాగా, ఇటీవ‌ల రేష‌న్ వాహ‌న‌దారుల వేత‌నాల‌ను ప్ర‌భుత్వం పెంచ‌డంతో వాలంటీర్లు కూడా త‌మ జీతాలు పెంచాలనే డిమాండ్ ప్రారంభించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.