ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు సన్నాహాలు చేస్తున్నట్టు ఆమె అనుచరులు ధృవీకరించారు.హైదరాబాద్ లోటస్ పాండ్ లో మంగళవారం కీలక సమావేశం.సమావేశం ఎజెండాపై ఉత్కంఠ సాగుతోంది.ఇప్పటికే YSRCP లో అనేక ఊహగానాలు ఉన్నవి.”YSR అభిమానులరా రండి.తరలి రండి! ఈ అడుగు రేపటి తెలంగాణ భవితకు పునాది” అని సోషల్ మీడియా లో ప్రచారం ఉధృతంగా సాగుతోంది.
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. దీని వెనుక ఎవరున్నారు? ఆమె వ్యూహం ఏమిటి? జగన్ తనకు ప్రాధాన్యం ఇవ్వనందుకు షర్మిల కొంతకాలంగా తీవ్ర నిరాశతో ఉన్న మాట నిజమే. అంత మాత్రాన ఆమె కొత్త పార్టీ పెట్టి ఏమి సాధించగలరు? అనే ప్రశ్న వస్తోంది. పైగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆంధ్రపార్టీ గా ముద్రపడింది. అలాంటి పార్టీ అధినేత సోదరి పక్క రాష్ట్రంలో కొత్త పార్టీ స్థాపించినట్లయితే తెలంగాణ ప్రజలు ఎట్లా ఆమోదించనున్నారు? షర్మిల వెనుక ఖచ్చితంగా TRS ప్రముఖులు ఉండే అవకాశం ఉన్నట్లు ఒక ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది. బీజేపీని ఎదుర్కునే వ్యూహం లో భాగంగా ‘రెడ్డి’సామాజిక వర్గాన్ని చేరదీయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టు వదంతులు ఉన్నవి.ఇవి నిజంగా ఎలా వర్కవుట్ అవుతాయో ఊహాజనితమే!