చెన్నై లో రూ.1,000 కోట్ల బ్లాక్ మనీని గుర్తించి రూ.1.2 కోట్ల నగదును రెండు సంస్థల్లో చేపట్టిన సోదాల్లో సీజ్‌ చేశామని ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ రెండు సంస్థలు చాల పెద్ద పేరు ఉన్న ప్రముఖ సంస్థలు అవ్వడం చర్చనీయాంశం.
అందులో ఒక సంస్థ దక్షిణ భారతదేశంలో అతి పెద్ద బంగారు ఆభరణాల రిటైల్‌ సంస్థ కాగా, రెండవది ప్రముఖ బులియన్‌ ట్రేడర్‌ గ్రూప్. ఈ నెలలో 4 వ తేదీన ఆ సంస్థలకు చెందిన పలు బ్రాంచ్ లలో సోదాలు నిర్వహించి ఈ నగదును సీజ్ చేశామని అధికారులు వెల్లడించారు. మొత్తం 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. తదుపరి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.