దేశంలో మూడు రోజులుగా కరోనా కేసులు 18వేలకు పైనే నమోదవుతున్నాయి. మొత్తం 5,37,764 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే, 18,599 కొత్త కేసులు నిర్ధారణ కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.12 కోట్లకు పైబడగా 1,88,747 ఆక్టివ్ కేసులు ఉండగా, 1.68 శాతంగా కొనసాగుతోంది.

గడిచిన 24 గంటల్లో కోవిద్ కారణంగా 97 మంది మృమృతో చెందగా, ఇప్పటి వరకు మొత్తం 1,57,853 మంది ప్రాణాలు వదిలారు. నిన్న ఒక్కరోజే 14,278 మంది కరోనా నుంచి కోలుకోగా, వైరస్‌ నుంచి బయటపడినవారి సంఖ్య 1,08,82,798కి చేరింది. రికవరీ రేటు 96.91 శాతంగా ఉంది. నిన్నటి వరకు 2,09,89,010 మందికి కరోనా టీకా పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.