ఒక పక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటూ ప్రపంచ మహిళలు అంతా సంబరాలు జరుపుకుంటుంటే మరొక పక్క మెదక్‌ జిల్లా అల్లా దుర్గం మండలం గడిపెద్దాపూర్లో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ఒక మహిళపై యాసిడ్‌ పోసి పరారయ్యాడు. కాలిన గాయాలతో పడి ఉన్న మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలని టేక్మాల్‌ మండలం అంతాయిపల్లి తండా వాసిగా గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు.