గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు పెరిగాయి. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో కూడా రేట్లు పైకి కదిలాయి. పసిడి రేటు ఈరోజు మాత్రం పరుగులు పెట్టింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పెరిగింది. దీంతో రేటు రూ.45,500కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.260 పెరుగుదలతో రూ.41,710కు ఎగసింది.ఇక వెండి రేటు కూడా కేజీకి రూ.200 పెరిగింది. దీంతో రేటు రూ.71,100కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.59 శాతం పెరుగుదలతో 1708 డాలర్లకు ఎగసింది. వెండి ధర కూడా ఇఔన్స్‌కు 1.65 శాతం పెరుగుదలతో 25.70 డాలర్లకు చేరింది.