జేఈఈ మెయిన్‌-2021 పరీక్షలు ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగిన విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా జేఈఈ మెయిన్‌-2021 ఫలితాలు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 6.61 లక్షల మంది జేఈఈ మెయిన్‌-2021కు హాజరు అయి 6.20 లక్షల మంది వరకు పేపర్‌-1 రాశారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర మంది వరకు ఈ పరీక్షలు రాశారు.

ఈసారి పరీక్ష రాసిన విద్యార్థులకు అడ్మిషన్‌ సమయంలో వెసులుబాటు కల్పించింది. జేఈఈ మెయిన్‌ -2021 క్వాలిఫై అయిన విద్యార్థులు మార్కులతో సంబంధం లేకుండా క్లాస్‌ 12 ఉత్తీర్ణులైన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. కరోనా కారణంగా కేవలం 2021-2022 సంవత్సరానికే ఈ షరతు వర్తిస్తుందని తెలిపింది.