కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారంఫై ప్రకటన చేసిన సంగతి పాఠకులకు విదితమే!
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఖాయమన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కార్మిక సంఘాలు కోపంతో మండిపడుతున్నాయి. విశాఖలోని కూర్మన్నపాలెం వద్ద వివిధ సంఘాలు రాస్తారోకో చేపట్టాయి. నేతలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేరకు రాకపోకలు నిలిచిపోయాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. మలిదశ ఉద్యమానికి ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రులను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని, అవసరమైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.