జాతీయం (National) వార్తలు (News)

మహిళాదినోత్సవం సందర్భంగా మహిళలకు ఎస్బిఐ కానుక

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకోసం అనేక సంస్థలు అనేక ఆఫర్లను ప్రకటిస్తుంటే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సొంతింటి కలని నిజం చేసుకోవాలనుకునే మహిళలకు తీపి కబురు అందించింది. మహిళలకు గృహరుణాలపై వడ్డీరేటును అదనంగా 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది.

తాజా సవరణ అనుసరించి 6.70 శాతం వద్ద ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ ను మహిళలకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు, విమెన్స్‌ డే సందర్బంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరింది. మీ కలల సౌథం మా లక్ష్యం అని, అలాగే యోనో యాప్‌ ద్వారా జరిపే బంగారు, డైమండ్‌ ఆభరణాల కొనుగోళ్లపై 30 శాతం దాకా స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నట్టు ట్వీట్‌ చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.