టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

స్వర్ణ కృష్ణ – షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా – మగువల నౌక

సముద్ర యాన రంగం అంటేనే పూర్తిగా పురుషాధిక్యం కలిగిన రంగం. ఈ రంగంలో మూస పద్ధతులు, ఆలోచన ధోరణులను ఛేదించిన మహిళల కోసం- కేంద్ర నౌకాయాన శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన నౌకా యాత్రను చేపట్టింది.

‘‘షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)కు చెందిన ‘ఎం.టి. స్వర్ణకృష్ణ’ అనే భారీ నౌకను దీనికి వేదికను చేశారు. కేంద్ర రేవులు, నౌకాయాన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ జెండా ఊపి ఈ చరిత్రాత్మక యాత్రను ప్రారంభించారు. ఒక కొత్త అధ్యాయానికి తెర తీసి ప్రపంచ నౌకాయాన చరిత్రలో ఒక నౌకను పూర్తిగా మహిళా అధికారులే నడపడం ఇదే మొదటిసారి.


స్వర్ణకృష్ణ అనేది ఒక పెట్రో ఉత్పత్తులను రవాణా చేసే ట్యాంకర్‌ నౌక. 2010లో దీన్ని నిర్మించారు. గరిష్ఠంగా 10.5 నాట్‌ (గంటకు దాదాపు 20 కిలోమీటర్లు)ల వేగంతో ప్రయాణిస్తుంది. 73 వేల టన్నుల బరువును ఇది మోసుకెళ్లగలద’’ని అధికారులు తెలిపారు.

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వజ్రోత్సవాలతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యాత్రను కేంద్రం చేపట్టగా ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టులోని లిక్విడ్‌ బెర్త్‌ జెట్టీ నుంచి స్వర్ణకృష్ణ బయలుదేరింది. మహిళా నావికా సిబ్బంది త్యాగాలు, సేవలను ఈ సందర్భంగా మంత్రి మాండవీయ ప్రశంసలు తెలియచేయసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.