భూమిలో బంగారం పండుతుందని పెద్దలు చాల సమయాల్లో చెప్పడం మనకు తెలుసు! ఇప్పుడు నిజంగా భూమిలో బంగారం బయట పడింది. జనగామ జిల్లాలో పెంబర్తికి చెందిన నర్సింహా అనే రైతు తన 11 ఎకరాల భూమిని చదును చేస్తున్న సమయంలో ఒక లంకె బిందె బయటపడింది. దీంతో ఆ రైతు అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు లంకెబిందెలను స్వాధీనం చేసుకున్నారు. లంకెబిందెల్లో సుమారు 5 కేజీల బంగారం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. బంగారం ఈ కాలంనాటిదా? లేక పురాతన కాలానికి చెందినదా అన్న విషయాన్ని పురావస్తు శాఖ అధికారులు తేలుస్తారని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు లంకెబిందెలు దొరకడంతో ఆ సొమ్ముతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.