గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ పారిశ్రామికవాడలో దామోదర్ పార్కు ఎంటీఎన్ఎల్ కార్యాలయ భవన సమీపంలోని స్టేషనరీ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించి మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే 15 అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, కాని ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పుతున్నారు.