జాతీయం (National) వార్తలు (News)

ఎఫ్‌ఏసీటీ రద్దు చేస్తూ కేంద్రం ఆదేశాలు..

దేశంలో 19 ట్రైబ్యునళ్లను రద్దు చేస్తూ కేంద్రం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఫిల్మ్ సర్టిఫికేషన్ అపిలేట్ ట్రైబ్యునల్ (ఎఫ్‌ఏసీటీ) కూడా ఉంది. సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) నుంచి సినిమాలకు సర్టిఫికెట్ పొందడంలో ఏవైనా సమస్యలు ఉంటే నిర్మాతలు ఇప్పటి వరకు ఎఫ్ఏసీటీని ఆశ్రయించడంతో ఊరట లభించేది. ఇప్పుడు దానిని రద్దు చేయడంతో ఇకపై వారు హైకోర్టును సంప్రదించాలి. ఈ నిర్ణయానికి సంబంధించిన బిల్లును ఫిబ్రవరిలోనే కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం లభించకపోవడంతో అత్యవసరంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఏసీటీని రద్దు చేయడంపై భారీ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల సినిమాల విడుదలలో ఆలస్యం జరుగుతుందని, సినీ రంగానికి ఇదో దుర్దినమని దర్శకుడు విశాల్ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.