ఏపీలో గత 24 గంటల్లో 31,268 శాంపిల్స్ పరీక్షించగా మరో 2558 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 9,15,832కు చేరింది. గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7268కి చేరింది. తాజాగా 915మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,89,651కు చేరింది. మరొక 14913మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.