బ్రెజిల్‌లో ఒక్క మంగళవారంనాడే 4,195 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3.40 లక్షలకు చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలినా, రోగులతో నిండిన ఆసుపత్రుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా కూడా చాలా మంది గవర్నర్లు, మేయర్లు, జడ్జిలు ఆర్థిక వ్యవస్థలో కొన్ని కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నారు. 4.6 కోట్ల జనాభాతో బ్రెజిల్‌లోనే అత్యంత రద్దీ రాష్ట్రమైన సావోపాలోలో తాజాగా ఒక్క రోజు వ్యవధిలో 1,400 మరణాలు నమోదయ్యాయి.