జాతీయం (National) వార్తలు (News)

స్వల్ప లాభాలు చవి చూసిన మార్కెట్లు

గురువారం దేశీయ మార్కెట్లు ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభంతో దూసుకెళ్లింది. కానీ తరువాత తీవ్ర ఒడుదొడుకుల్లో స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. నిన్న ఆద్యంతం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్ ఇవాళ ఉదయం ప్రారంభంలో కూడా అదే తీరుగా నడిచాయి. కానీ ఆ తీరు ఎంతోసేపు జోరుగా సాగలేదు. మధ్యాహ్నం తర్వాత కొన్ని రంగాల షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒత్తిడికి గురైన సూచీలు ఆరంభ లాభాల్లో చాలా వరకు కోల్పోయి ఒక దశలో నష్టాల్లో ట్రేడ్‌ అయిన తరువాత చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.సెన్సెక్స్‌ 84.45 పాయింట్ల లాభంతో 49,746.21 వద్ద, నిఫ్టీ 54.80 పాయింట్ల లాభంతో 14,873.80 వద్ద ముగిశాయి.

ఎన్‌ఎస్‌ఈలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్‌, హిందాల్కో షేర్లు లాభపడితే సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, ఓఎన్జీసీ షేర్లు నష్టపోయాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.