వార్తలు (News)

సొంత ఊరికి చేరుకుంటున్న వలసకార్మికులు ..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉండనే భయంతో వలస కార్మికులు ముందుజాగ్రత్త చర్యగా పట్టణాలను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధిస్తున్న కారణంగా ఉన్నఫళంగా ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్‌ విధిస్తే తమకు నాటి కష్టాలు మళ్లీ తప్పవన్న భయం కార్మికుల్లో నెలకొనడంతో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి బిహార్‌కు తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో తూర్పు మధ్య రైల్వే వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడి పట్టణ ప్రాంతాల్లోని బస్సుస్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌, దిల్లీ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వలస కార్మికులు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.