అంతర్జాతీయం (International) వార్తలు (News)

న్యూజిలాండ్‌లో భారతీయులకు నోఎంట్రీ

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నతరుణంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు (ఆ దేశ పౌరులతో సహా) ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాల పాటు తమ దేశంలోకి ప్రవేశాన్నినిలిపివేసింది.

‘‘భారత్‌ నుంచి ప్రయాణికులెవరూ న్యూజిలాండ్‌లోకి రాకుండా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఏప్రిల్‌ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్‌ 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ప్రయాణికుల రాకపై తాత్కాలిక నిషేధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను మేం అర్థం చేసుకోగలం. కానీ, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇటీవల విదేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించగా.. అందులో 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా.. వీరిలో 17 మంది భారత్‌ నుంచి వచ్చినవారే కావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.