ఆంధ్ర ప్రదేశ్ లో ఉదయం7 గంటలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు పోలింగ్ జరుగుతోంది. 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా మరోవైపు 7,220 ఎంపీటీసీ స్థానాలకు 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పరిషత్‌ ఎన్నికల కోసం 27,751 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఏపీలో 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 247 పోలింగ్‌ కేంద్రాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 3,538 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఏపీవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. . ఉదయం7 గంటలకు ప్రారంభమైన పోలింగ్. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.. ఇదిలా ఉంటే.. 13 జిల్లాల్లో మొత్తం 2,46,71,002 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 375 స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు.

జిల్లాల వారీగా ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా ఉంది

శ్రీకాకుళం : 8.99 %

విజయనగరం : 9.01%

విశాఖపట్నం : 8.83%

తూర్పుగోదావరి : 4.59%

పశ్చిమగోదావరి : 3.42%

కృష్ణ జిల్లా : 9.32%

గుంటూరు : 7.52%

ప్రకాశం : 6.53%

నెల్లూరు : 6.36%

చిత్తూరు : 7.29%

వైఎస్సార్ కడప : 4.81%

కర్నూల్ : 9.58%

అనంతపురం : 9.05%

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 7.6 శాతం పోలింగ్ నమోదు.