క్రైమ్ (Crime) వార్తలు (News)

శవాన్ని బ్రతికిస్తామంటూ మరిగే నీళ్లు పోసి..

ఎంతగా ప్రభుత్వాలు మూఢనమ్మకాలు విడిచిపెట్టాలని చెబుతున్నా కూడా ఇంకా అక్కడక్కడా వాటి తాలూకా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది మోసగాళ్లు వైద్య శాస్త్రానికి కూడా సాధ్యంకాని పనులు సైతం తాము చేస్తామంటూ అమాయకులను మోసం చేసి వారిని దోచుకుంటున్నారు.మనం ఇంతవరకూ మంత్రాలు, తాయత్తులతో జబ్బులు నయం చేస్తామని, లేదా నరబలి ఇస్తే నిధులు దక్కుతాయని చెప్పేవాళ్ల గురించి మనం విన్నాం కానీ ఒడిశాలో ఏకంగా చనిపోయిన మనిషినే బతికిస్తామంటూ నమ్మించి ఒక గూడెం మొత్తాన్ని మోసం చేసిన సంఘటన జరిగింది. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది?

ఇటీవల నయాగఢ్‌ జిల్లాలోని బార్సాహీ అనే కుగ్రామంలో ఓ వ్యక్తి అనారోగ్యం పాలవగా వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందడంతో వైద్యులు శవపరీక్ష నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.అయితే శవానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన సమయంలో తమ ఇంటిపెద్దను బతికిస్తామని మోసగాళ్లు చెప్పడంతో పెద్దగా నాగరికత తెలియని మృతుడి కుటుంబీకులు క్షుద్రపూజలకు అనుమతించారు. దీంతో గిరిజన గూడెం ప్రజల సమక్షంలోనే శవానికి క్షుద్రపూజలు నిర్వహించారు. మృతదేహాన్ని ఇంటి బయట నేలపై ఉంచి శవంపై సలసల కాగే నీటిని కుండలకొద్దీ పోసి, ఆ తర్వాత గుండెను బలంగా నొక్కి అనేక ఫీట్లు చేశారు. చనిపోయిన వ్యక్తి ఎలా బతుకుతాడో చూడాలనే కుతూహలం కొద్దీ గూడెం ప్రజలంతా గుడ్లప్పగించి చూశారు. గంటలు గడుస్తున్నా శవంలో ఎలాంటి కదలిక కనిపించలేదు. ఈలోగా విషయం పోలీసులకు తెలియడంతో వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.