క్రైమ్ (Crime) వార్తలు (News)

సంబరాల్లో రాకేశ్వర్ ‌సింగ్ కుటుంబం

మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత విముక్తి లభించింది. ఛత్తీస్‌గఢ్‌లోని తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో, బసగూడ అడవుల్లో వందల మంది గ్రామస్తుల మధ్య రాకేశ్వర్‌ను విడిచిపెట్టారు. ఆయన విడుదలతో రాకేశ్వర్ కుటుంబం సంబరాలు చేసుకుంది. జవాన్ విడుదల కోసం 11 మంది మధ్యవర్తుల బృందం ప్రయత్నాలు చేసింది. ఈ బృందంలో ఏడుగురు జర్నలిస్టులు కూడా వున్నారు. వారితో చర్చల తర్వాత జవాన్‌ను విడుదల చేయడానికి మావోలు అంగీకరించారు.దీంతో ఆయన బీజాపూర్‌లోని సీఆర్పీఎఫ్‌ శిబిరానికి చేరుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.