నక్సల్స్ చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు ఐదు రోజుల తర్వాత జవానును విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ మరి కాసేపట్లో బీజాపూర్‌ క్యాంప్‌నకు చేరుకోనున్నారు.

తమ తండ్రిని విడిచిపెట్టాలంటూ జవాను కుమార్తె చేసిన విజ్ఞప్తిని మీడియా ద్వారా స్వీకరించామని మావోయిస్టులు నిన్న ప్రకటించారు. ఈ నెల 5న జవాను తమ వద్ద బందీగా ఉన్నట్లు లేఖ విడుదల చేసిన నక్సల్స్ బుధవారం ఆయన ఒక పూరి గుడిసెలో క్షేమంగా ఉన్నట్లు ఉన్న ఫొటోను పత్రికలకు పంపించాయి.