మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం సాగిస్తున్న ఈ తరుణంలో తెలంగాణ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం పలు విమర్శలకు తావిస్తుంది. పొరుగు రాష్ట్రంలో నిత్యం వేలాది కేసులు నమోదవుతుండగా, ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను పునరుద్ధరించడం వైరస్ వ్యాప్తి కి కారణం అవుతుందనే భయం ప్రయాణికులకు నెలకొంది. సోమవారంనుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు బస్సులునడుపుతుండడం, వైరస్‌ వ్యాప్తి ఎక్కువగాఉన్న ఆయా ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళనకర అంశంగా మారింది. ‘మహారాష్ట్ర’ ప్రభావం కారణంగా ఇప్పటికే సరిహద్దుల్లోని మన పల్లెల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో ఆ రాష్ట్రానికి సర్వీసులను పునరుద్ధరించడం దురదృష్టకరం.