యావత్‌ క్రీడా ప్రపంచం ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ సీజన్ వచ్చేసింది. కరోనా కారణంగా
గతేడాది దుబాయ్‌కి తరలిపోయిన ఐపీఎల్ ఏడాది భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చి రేపు (ఏప్రిల్‌ 9న) డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్‌ 2021 సీజన్‌ ఘనంగా ప్రారంభమవుతుంది.

ఫేస్‌ టు ఫేస్‌ ఫైట్‌ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పటివరకు రెండు జట్లు 27 సందర్భాల్లో ఎదురుపడగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైదే పైచేయిగా నిలిచింది. నెక్‌ టు నెక్‌ ఫైట్‌లో ముంబై 17సార్లు గెలుపొందగా, ఆర్‌సీబీ మ్యాచ్‌ల్లో 9 సార్లు మాత్రమే విజయం సాధించి ఒక మ్యాచ్‌ టై(2020) కాగా, సూపర్‌ ఓవర్‌ ద్వారా ఆర్‌సీబీ విజేతగా నిలవడంతో ఆర్‌సీబీ విజయాల సంఖ్య 10కి చేరుకుంది. కానీ టైటిల్‌ల పరంగా చూస్తే ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకు 5 సార్లు విజేతగా నిలిచింది. బెంగళూరు జట్టుకి మాత్రం బోణీ దొరకలేదు.

రోహిత్‌ సారధ్యంలో ముంబై వరుసగా రెండు టైటిల్‌లు(2019, 2020) నెగ్గి హ్యాట్రిక్‌ టైటిల్‌లకై ప్రయత్నించగా , కోహ్లి నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తూ, హాట్‌ ఫేవరేట్‌గా నిలిచింది. ఆయా జట్ల బలాబలాలను బేరీజు వేస్తె స్వదేశీ, విదేశీ స్టార్ల కలయికతో ఇరు జట్లు సమిష్టిగా కనిపిస్తున్నాయి. ఆర్‌సీబీ తరఫున ఓపెనర్లుగా దేవదత్ పడిక్కల్, కెప్టెన్‌ కోహ్లిలు వచ్చే అవకాశమే ఉంది. వన్‌ డౌన్‌లో మహ్మద్ అజారుద్దీన్, సెకెండ్‌ డౌన్‌లో ఏబీ డివిలియర్స్, ఆతరువాత డానియల్‌ క్రిస్టియన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీసన్లతో ఆర్‌సీబీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా కనిపిస్తుంది.

బౌలింగ్‌‌లో యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ లేదా రజత్ పటిదార్‌ లేదా సచిన్ బేబీలకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ముంబై విషయం చుస్తే బ్యాటింగ్‌లో ఇషాన్‌ కిషన్‌, డికాక్‌, రోహిత్‌, క్రిస్‌ లిన్‌, పోలార్డ్‌, సూర్యకుమార్‌, పాండ్యా బ్రదర్స్‌తో ఆ జట్టు అత్యుత్తమంగా కనిపిస్తుంది. బౌలింగ్‌ విభాగంలో బౌల్ట్‌, బుమ్రా, నాథన్ కౌల్టర్‌ నైల్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌, పియూష్‌ చావ్లా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లతో ఆ జట్టు దృఢంగా ఉంది.