వార్తలు (News)

అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌ తేదీలు ఖరారు!!

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమెజాన్‌ ‘ప్రైమ్‌ డే సేల్‌’ కు సిద్ధమైంది. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ సేల్‌ నిర్వహించనుంది. జూన్‌లోనే ఇది జరగాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా ఆలస్యమైంది. ఈ సేల్‌లో కొత్తగా 300 ఉత్పత్తులను లాంచ్‌ చేయడంతో పాటు ఎప్పటిలానే మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లు లభించనున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది. అమెజాన్‌ పేతో కొనుగోలుపై ₹1000, అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై ఐదు శాతం వరకు రివార్డు పాయింట్లు లభిస్తాయి. అయితే, ఏయే వస్తువులపై ఎంతెంత డిస్కౌంట్‌ లభిస్తుంది? కొత్తగా లాంచ్‌ చేయబోయే వస్తువులేంటి? వంటి వివరాలు తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాలి..!

కరోనా కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులు, చేనేత కార్మికులు, తయారీదారులకు చేయూతనిచ్చేందుకు దీనిని నిర్వహించాలనుకుంటున్నట్టు అమెజాన్‌ ప్రకటించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •