టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

టెన్త్ పాసైన మహిళలకోసం అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్!!

తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి ఖాళీగా ఉన్న 135 అంగన్వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా, సంక్షేమ అధికారి కార్యాలయం నోటిఫికేషన్ వివుడల చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జులై 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో మొత్తం 135 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లు తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా టెన్త్ పాసైన, వివాహితులైన మహిళలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు స్థానికంగా గ్రామ లేదా మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తూ ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థినుల వయస్సు 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18-35 ఏళ్లు ఉంటే సరిపోతుంది.

అంగన్వాడీ టీచర్లు : 36
అంగన్వాడీ ఆయాలు: 83
మినీ అంగన్వాడీ టీచర్లు: 16

-పుట్టిన తేదీ/వయస్సు ధ్రువీకరణ పత్రం
-కుల ధ్రువీకరణ పత్రం
-విద్యార్హత ధ్రువీకరణ పత్రం, టెన్త్ మార్క్స్ మెమో
-నివాస స్థల ధ్రువీకరణ పత్రం
-అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి ధ్రువీకరణ పత్రం
-వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
-అనాథ అయితే అనాథ సర్టిఫికేట్
-వికలాంగులు అయితే సంబంధిత ధ్రువీకరణ పత్రం

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 15 సాయంత్రం 5 గంటలోగా ఆన్లైన్లో ఆప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://mis.tgwdcw.in/ను సందర్శించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర పూర్తి వివరాలను, ఖాళీల వివరాలను పైన ఇచ్చిన లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థులను మొదటగా షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహించిన ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఈ నెల 16 నుంచి 24లోగా ఒరిజినల్ సర్టిఫికేట్లను స్క్రూటీని చేయించుకోవాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •