అంతర్జాతీయం (International) వార్తలు (News)

దుబాయ్‌ జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు??

ప్రపంచంలోని అతిపెద్ద పోర్టులలో ఒకటైన దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు సంభవించి భారీ విస్ఫోటనం జరగడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం అర్థరాత్రి తరువాత పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో పేలుడు శబ్దం దాదాపు 25 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించడమే కాకుండా చాలా భవనాల్లోని కిటికీలు, తలుపులు కొట్టుకుని పాత కాలం గోడలు కూలిపోయాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. దాదాపు రెండున్నర గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంత వరకు తెలియరాలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •