జాతీయం (National) వార్తలు (News)

ఫ్లిప్ కార్ట్ Shopsy ఫ్లాట్ ఫామ్.. పెట్టుబడిలేని వ్యాపారం!!

చాలామందికి ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే డబ్బులు సంపాదించాలి అనే కోరిక ఉంటుంది. కానీ పెట్టుబడి లేకుండా సంపాదించడం అన్నది చాల కష్టమైన విషయం అని తెలిసిందే ! మరి కొంతమందికి ఇంట్లో ఉంటూనే డబ్బులు రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు సరికొత్తగా ఎటువంటి పెట్టుబడి లేకుండా నెలకు 30 వేల రూపాయల వరకు ఇంట్లో ఉంటూనే ఆదాయం పొందడానికి అవకాశం వచ్చింది.

పెట్టుబడి లేకుండా ఇంట్లో ఉంది డబ్బులు సంపాదించాలి అనే వారి కోసం ఈ – కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ Shopsy ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసింది. దీనికి మీదగ్గర ఉండవలసింది ఒక స్మార్ట్ ఫోన్ మాత్రమే! అదెలా అంటే ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ లో లభించే అన్ని ప్రొడక్ట్స్ ఈ Shopsy ఫ్లాట్ ఫాం లో కనిపిస్తాయి.

ఫ్లిప్కార్ట్ ప్లాట్ ఫాం పై కనిపించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, దుస్తులు, సౌందర్య పరికరాలు, నిత్యావసర సరుకులు, మొబైల్ ఫోన్స్, షూస్ ఇలా అన్ని రకాలు Shopsy ఫ్లాట్ ఫామ్ లో ఏకంగా 15 కోట్ల ప్రొడక్టులను అమ్మవచ్చు. ఇక ఈ ప్రొడక్ట్ లను Shopsy ఫ్లాట్ ఫామ్ ద్వారా మీ సన్నిహితులకు ,బంధుమిత్రులకు కు షేర్ చేసి వారు కొనుగోలు చేస్తే వాటి ద్వారా మీకు కమిషన్ పొందే అవకాశం ఉంటుంది.

సిటీ లను మాత్రమే కాకుండా పల్లె ప్రాంతాలను కూడా దృష్టిలో పట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఫ్లిప్కార్ట్ సంస్థ తెలిపింది. 2023 వ సంవత్సరం నాటికి 2.5 కోట్ల ఆన్‌లైన్ ఆంట్రప్రెన్యూర్లను తమ Shopsy ఫ్లాట్ ఫామ్ లో చేర్చుకోవాలని భావిస్తోంది.Shopsy ఫ్లాట్ ఫామ్ ను మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకొని, ఇందులో ఉండే వస్తువులను మీ స్నేహితులకు , బంధువులకు రెకమెండ్ చేస్తే , వారు ఆర్డర్ చేయడం వల్ల మీరు కమీషన్ పొందవచ్చు.

పైన ఇచ్చిన సమాచారం ఫ్లిప్ కార్ట్ వారు చేసిన ప్రకటనలోనిది. ఈ సమాచారంలో నిజానిజాలు తెలుసుకుని ఆచరించవలసిన బాధ్యత పాఠకులదే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •