వార్తలు (News)

మొదటి శుభలేఖ తిరుమల పంపితే, టీటీడీ నుంచి బహుమతి!!

ఇంట్లో వివాహం నిశ్చయమైతే మొదటి శుభలేఖ కలియుగదైవం తిరుమల శ్రీవారికి పంపడం చాలా తెలుగు లోగిళ్లలో ఆనవాయితీగా వస్తుంది. తిరుపతికి దగ్గర వారైతే.. స్వయంగా పెండ్లి శుభలేఖను ఇస్తారు. మరి దూరపు భక్తులు శుభలేఖను పంపించడమెలా? అనే దానికి టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది.

ఇంట్లో వివాహం నిశ్చయమైతే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపించవచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్లి జరిగే రోజు తలంబ్రాల్లో కలుపుతారు) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపాలని టీటీడీ నిర్ణయించుకుంది.

కరోనా వేళ కూడా ఈ అవకాశం కల్పిస్తుంది. తిరుమల శ్రీవారి నుంచి పెళ్లి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇందుకోసం ‘శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’ చిరునామాకు మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్‌ చేయవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •