వార్తలు (News)

3 రోజుల పాటు ఆన్ లైన్ సేవలు బంద్.. !!

తెలంగాణలో మూడు రోజులపాటు ప్రభుత్వ వెబ్‌సైట్లన్నీ పని చేయవని, ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోనున్నాయని తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ వెల్లడించింది. అత్యాధునిక యూపీఎస్ (ఆన్ ఇంటరప్టబుల్ పవర్ స్టోర్స్) ఏర్పాటు కోసం ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఈ సేవలకు అంతరాయం కలగనున్నట్లు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ సేవలకు కేంద్ర బిందువైన స్టేట్‌ డేటా సెంటర్‌ (ఎస్‌డీసీ) లో కొత్త యూపీఎస్‌ సిస్టంను ఏర్పాటు చేయనున్న దృష్ట్యా వెబ్‌ సైట్లు, ఆన్‌లైన్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ఐటీ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఎస్‌డీసీలో చాలా కాలంగా పాత యూపీఎస్‌ ఉన్నందున పవర్‌ బ్యాకప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి తరచూ ఐటీ సేవలకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో దాని స్థానంలో కొత్త యూపీఎస్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఐటీ శాఖ నిర్ణయించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా కొత్త వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    95
    Shares
  • 95
  •  
  •  
  •  
  •