జాతీయం (National) వార్తలు (News)

నిన్న లాభాల మాట.. నేడు నష్టాల మూట!!

దేశీయ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. ఉదయం 53,039 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్‌ కాసేపటికే నష్టాల్లోకి జారుకుని రోజంతా అదే ఒరవడిని కొనసాగించి ఒక దశలో 650కి పైగా పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ చివర్లో కాస్త కోలుకుని 485.82 పాయింట్ల నష్టంతో 52,568.94 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 151.80 పాయింట్లు కోల్పోయి 15,727.90 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఆటో, హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా మోటార్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోగా.. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, శ్రీ సిమెంట్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •