వార్తలు (News)

ఏపిలో 2,050 కొత్త కేసులు.. 18 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 85,283 పరీక్షలు నిర్వహిస్తే 2,050 కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,82,308 కు చేరింది. నిన్న ఒక్కరోజే కొవిడ్‌ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం మృతుల సంఖ్య 13,531కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 2,458 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,48,828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,949 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    112
    Shares
  • 112
  •  
  •  
  •  
  •