అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

24 గంటల్లో 385 మంది ఉగ్రవాదులు హతం!!

ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా భద్రతాబలగాలు చేపట్టిన ఆపరేషన్లో 385 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమైనట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 210 మంది గాయపడినట్లు, 24 గంటల్లో నంగర్‌హార్‌, లోగర్‌, గజనీ, పక్తికా, మైదాన్‌ వార్తక్‌లో ఆఫ్ఘన్‌ జాతీయ రక్షణ భద్రతా దళాలు దాడులు చేశాయని తెలిపారు. కాందహార్, హెరాత్, ఫరా, జౌజ్జాన్, సమంగాన్, హెల్మాండ్, తఖర్, బాగ్లాన్, కపిసా, ఫైజ్-అబాద్ నగరం, బడాఖాన్ ప్రావిన్షియల్ సెంటర్, తఖర్ ప్రావిన్షియల్ రాజధాని తాలిఖాన్ సిటీపై తాలిబాన్ల దాడులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు.

ఈ దాడుల్లోనే 385 తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని, 210 మంది గాయపడ్డారని, ఆఫ్ఘన్ దళాలు కుందుజ్ ప్రావిన్షియల్ సెంటర్ శివారులోని తాలిబన్లు దాక్కున్న ప్రదేశాలను సైతం లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడి జరుపడంతో తాలిబాన్‌ ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •