వార్తలు (News)

బెంగాల్ వరదలు.. జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు!!

కుండపోత వర్షాల కారణంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. మూడు నదులు ఉప్పొంగి ప్రవహస్తున్నాయి. దక్షిణ బెంగాల్ లోని హుగ్లీ, పుర్బా మేదినిపూర్, హౌరా దక్షిణ పరగణాల ప్రాంతాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. మాల్డా జిల్లాలోని గంగా, పుల్హార్ , మహానదుల్లో వరద ఉద్ధృతి గంటగంటకు పెరుగుతోంది.

వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో..దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్ నుంచి దిగువకు నీరు విడుదల చేస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై 23 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షాలాధి మంది నిరాశ్రయులయ్యారు. మూగ జీవాలు, వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి.

సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్షలాది ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయి. సహాయ శిబిరాల్లో వరద బాధితులకు ఆహారం అందజేశారు. మాల్డాలోని మణిక్‌చక్ ఘాట్ పాయింట్ వద్ద గంగా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. మరోవైపు, వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •