ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

మసీదులో ఉచిత సర్జరీ ఆస్పత్రి ఏర్పాటు!!

హైదరాబాద్ షహీన్ నగర్‌లో సైఫ్ కాలనీలో అక్కడ ఒమెర్ అల్ షైఫా మసీదు ఉంది. తొలిసారిగా అందులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటుచేసింది. ఇందులో చిన్న చిన్న సర్జరీలు చేయడానికి పూర్తి సౌకర్యాలతో ఆపరేషన్ థియేటర్ (OT)ను శనివారం (7-august-2021) ప్రారంభించారు. ఇందులో సర్జరీ టేబుల్, ఓటీ లైట్స్, అడ్వాన్స్‌డ్ పరికరాలు, బయో-వేస్ట్ డిస్పోజల్ విధానం అన్నీ ఉన్నాయి.

పరిశుభ్రతకు పెద్ద పీట వేసి వచ్చిన పేషెంట్ సేఫ్‌గా ఉండేలా అన్నీ సమకూర్చారు. ఓటీ అనేది నిజానికి ఇక్కడ అదనం. అంతే కాకుండా ప్రైమరీ కేర్, డెంటల్ చైర్, కమ్యూనిటీ ఆఫ్తాల్మాలజీ, నాన్-కమ్యూనికబుల్ డిసీజ్ డెస్క్ వంటివి ఇక్కడ ఉన్నాయి. పేదవారికి ఉచితంగా ఈ సదుపాయాలు కల్పించనున్నారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (HHF) అనే స్వచ్ఛంద సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. పేషెంట్ పూర్తిగా కోలుకునేవరకూ కుల మత భేదాలేమి లేకుండా అందరికీ ఉచిత సేవలు అందిస్తామని చెప్పింది. ఇలా మసీదులో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం అనే కాన్సెప్టు కొత్తగా ఉందనీ, నలుగురికి మేలు చేసే పనిని ఎక్కడైనా ప్రారంభించవచ్చని ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    18
    Shares
  • 18
  •  
  •  
  •  
  •