క్రైమ్ (Crime) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

పైసలిస్తే.. పేపర్ లీక్ చేస్తాం..??

దళారుల మోసాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆదివారం జరుగనున్న సింగరేణి ఫిట్టర్​ ట్రైనీ ఎగ్జామ్​పేపర్ లీక్​ చేస్తానంటూ డబ్బులు వసూలు చేస్తున్న సింగరేణి ఉద్యోగిని మణుగూరు పోలీసులు శనివారం పట్టుకున్నారు.

సింగరేణిలో 128 ఫిట్టర్​ట్రైనీ పోస్టుల భర్తీకి ఆదివారం ఎగ్జామ్​ నిర్వహిస్తుండగా కొత్తగూడెంలో ఐదు సెంటర్లలో 2,681 మంది పరీక్షకు హాజరవుతున్నారు. అయితే మధ్యలో కొందరు దళారులు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇస్తే ఎగ్జామ్​ పేపర్​ లీక్​ చేస్తామంటూ బేరాలకు దిగారు. శ్రీరాంపూర్​, భూపాలపల్లి, మందమర్రి, కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో కొందరు నేరుగా క్యాండిడేట్ల ద్గరకు వెళ్లి మాట్లాడుతున్నారని వారం రోజులుగా ప్రచారం జరగడంతో ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సింగరేణి డైరెక్టర్​ ఎన్. బలరాం స్వయంగా ప్రకటన చేశారు.

ఈ నేపథ్యంలోనే సింగరేణి విజిలెన్స్​అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఎగ్జామ్​లో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండాఅన్ని చర్యలు తీసుకుంటున్నాం. స్కానర్లను ఏర్పాటు చేశాం. సెంటర్ల వద్ద పోలీస్​ బందోబస్తు ఉంటుంది. నిరుద్యోగులు దళారులను నమ్మి మోసపోవద్దు. ఎగ్జామ్స్​ నిర్వహణ, నియామకాలు పారదర్శకంగా జరుగుతాయని ఎన్. బలరాం ప్రకటించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •