అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్ లో భారత్‌ పథకాల సందడి!!

టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్‌ మంచి ప్రతిభ కనబరచి ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం కలిపి ఏడు పతకాలను ఒడిసి పట్టింది. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు రికార్డే ఇప్పటి వరకు అత్యధికం ఉండగా ఈసారి ఆ రికార్డు ను చెరిపేసింది. ముందు నుండి పతకాలు సాధిస్తారని ఆకాంక్షించిన క్రీడాకారులు నిరాశ పరచినా కొత్త క్రీడాకారులు ముందుకొచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పి యావత్ భారతావనికి వన్నె తెచ్చారు.

వాస్తవానికి శుక్రవారం వరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 5. వాటిలో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌ ఆదివారంతో ముగియనుండగా భారత క్రీడాకారులు పాల్గొనే క్రీడాంశాలు శనివారంతోనే ముగిశాయి. చివరి రోజు ముగ్గురు క్రీడాకారులే పతక బరిలో నిలిచారు. దీంతో లండన్‌ రికార్డును దాటలేమేమోనన్న మీమాంశ నెలకొనగా బజరంగ్‌ పునియా కాంస్యంతో అదరగొట్టి ఆశలు చిగురింపజేశాడు. నీరజ్‌ చోప్రా ఆ కలను నిజం చేశాడు. ఇప్పటి వరకు స్వర్ణ పతకం సాధించలేదన్న సగటు భారతీయుల కలను నెరవేరుస్తూ జావెలిన్‌ త్రోలో స్వర్ణంతో మెరిశాడు. అంతేకాకుండా వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించిపెట్టాడు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ 47వ స్థానంలో నిలవగలిగింది

టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి ఛాను సిల్వర్‌ పతకం సాధించి పతాకాలు పరంపరను ఆరంభించగా,బ్యాడ్మింటన్‌లో సింధు కాంస్యంతో అలరించి, బాక్సర్‌ లవ్లీనా కాంస్యంతో మెరిపించింది. ఇక పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించగా, రెజ్లర్‌ రవికుమార్‌ దహియా రజత పతకంతో మెరిపించగా, భజరంగ్‌ పునియా కాంస్యంతో రాణించగా, నీరజ్‌ చోప్రా స్వర్ణంతో మురిపించాడు. దీంతో ఇప్పటి వరకు లండన్‌ (రెండు రజత, నాలుగు కాంస్య) పేరిట ఉన్న పతకాల రికార్డును భారత్‌ అధిగమించగలిగింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •