అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) జాతీయం (National)

నైజీరియన్ల మోసాలకు అంతే లేదా??

నైజీరియన్లు ఎప్పటికప్పుడు తమ ఆయుధాలను మార్చుకుంటూ కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఫోన్ లు చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే పనిలో ఉండే వీరు ఇప్పుడు తాజాగా కరోనాను తగ్గించే నూనె, ఆయుర్వేద మూలికలు, పురుషుల్లో సంతాన సాఫల్యాన్ని పెంచే విత్తనాలు ఇస్తామని ఆయుర్వేద వైద్యుల పేరుతో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుని వారికి ఆసక్తి ఉన్న అంశాలను అధ్యయనం చేసి మరీ మోసాలకు తెరతీస్తున్నారు. హైదరాబాద్‌ వైద్యుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ నుంచి రూ.11.80 కోట్లు బదిలీ చేయించుకున్న నైజీరియన్లు పుణె, బెంగళూరు, దిల్లీల్లోనూ నేరాలకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు నెలల్లో సుమారు రూ.22 కోట్లు కొల్లగొట్టారని ప్రాథమిక సమాచారం!

దిల్లీలో నివసించే మాజీ బ్రిగేడియర్‌(67)ను జాస్మిన్‌ విల్సన్‌ పేరుతో ఓ నైజీరియన్‌ యువతి రెండు నెలల క్రితం పరిచయం చేసుకుంది. లండన్‌లో తాము సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, పురుషుల్లో సంతానలేమిని తగ్గించే విత్తనాలను అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి కొంటున్నామని చెప్పింది. వారు ఒక ప్యాకెట్‌ రూ.7 వేలకు ఇస్తున్నారని, మీ నుంచి రూ.21 వేలకు కొంటామని నమ్మించింది. నెల రోజుల్లో రూ.1.09 కోట్లు బదిలీ చేయించుకొంది.

బెంగళూరులోని విశ్రాంత అధికారిని జనవరిలో ముగ్గురు నైజీరియన్లు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకున్నారు. వింధ్య పర్వతాల్లో లభించే ప్రత్యేకమైన నూనె కరోనా వైరస్‌ను నియంత్రిస్తోందని, బ్రిటన్‌లోని 2ప్రముఖ ఫార్మా కంపెనీలు దాన్ని కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. లీటర్‌ నూనెను రూ.40 లక్షలకు కొంటున్నారని, మీకు రూ.55 లక్షలు ఇప్పిస్తామంటూ నమ్మించారు. మూడు నెలల్లో ఆయన్నుంచి రూ.3.95 కోట్లు బదిలీ చేయించుకుని మోసగించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •