టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

జియో ఫైబర్ ‘కెమెరా ఆన్ మొబైల్’ కొత్త ఫీచర్‌!!

జియో ఫైబర్ ఎప్పటికప్పుడు తమ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ తన వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే! ఇప్పుడు కూడా జియో ఫైబర్ ఇప్పుడు మరో కొత్త సదుపాయంతో ముందుకు వచ్చింది. ఇకపై జియో వినియోగదారులు టీవీల్లో కూడా వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి వెబ్ కెమెరాలు కూడా అవసరం లేదు. ‘కెమెరా ఆన్ మొబైల్’ అనే ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ టీవీల్లో వీడియో కాలింగ్‌ ఆప్షన్‌ను పొందవచ్చునని జియో ఒక ప్రకటనలో తెలిపింది.

కానీ టీవీల్లో వీడియో కాలింగ్ సదుపాయం పొందాలంటే జియోజాయిన్‌ అనే యాప్‌ను యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. గత కొన్ని నెలలుగా ‘కెమెరా ఆన్ మొబైల్’ ఫీచర్‌ను పరీక్షిస్తోన్న జియో ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొబైల్ ఫోన్ కెమెరా ద్వారా యూజర్లు తమ టీవీలో వీడియో కాల్ చేయడానికి ముందుగా పది అంకెల జియో ఫైబర్ నంబర్‌ను జియోజాయిన్‌ యాప్‌లో నమోదు చేసి జియో జాయిన్‌ యాప్ సెట్టింగ్‌లలో ‘కెమెరా ఆన్ మొబైల్’ ఫీచర్‌తో వీడియోకాల్స్‌ చేసుకోవచ్చును.

స్పష్టమైన వీడియో కాలింగ్‌ సేవల కోసం జియోఫైబర్‌ మోడమ్‌ను 5GHz Wi-Fi బ్యాండ్‌కి మార్చాల్సి ఉంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 2.4GHz బ్యాండ్‌లో కూడా వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను పొందవచ్చునని, కాకపొతే వీడియో కాలింగ్‌లో కొంత అస్పష్టత ఉండవచ్చునని జియో తెలిపింది. దీంతోపాటు జియోఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను వినియోగించుకునే తమ మొబైల్‌లోని జియోజాయిన్‌ యాప్‌ ద్వారా ల్యాండ్‌లైన్‌ నంబర్లకు కూడా వాయిస్‌కాల్స్‌ చేసుకోవచ్చునని తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    70
    Shares
  • 70
  •  
  •  
  •  
  •