వార్తలు (News)

తిరుమల లో పరిమితంగా జారీ చేస్తున్న శ్రీవారి దర్శన టికెట్లు!!

కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి దర్శన టికెట్లను తక్కువ సంఖ్యలోనే జారీ చేస్తున్నామని తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి తెలిపారు. శనివారం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమంలో పాల్గొన్న జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా మూడో దశకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలను పాటించాలని, అద్దె గదులను ఆధునికీకరించి భక్తులకు సులభతరంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. గదులు పొందిన యాత్రికులు అక్కడ సౌకర్యాలు, లోటుపాట్లపై ఫిర్యాదు చేసేందుకు నూతనంగా మొబైల్‌ నంబరు 99890 78111ను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •