క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

జమ్మూకశ్మీర్‌ లో 45 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు!!

జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా మొత్తం 14 జిల్లాల్లోని 45 ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు చేపట్టి నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యుల నివాసాలే లక్ష్యంగా తనిఖీలు జరుపుతుంది.

దిల్లీ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఎన్‌ఐఏ బృందం ఈ సోదాలు నిర్వహిస్తుండగా వీరికి జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బృందాలు సహకరిస్తున్నాయి. దోడా, కిష్టావర్‌, రంబన్‌, అనంత్‌నాగ్‌, బద్గాం, రజౌరీ, షోపియాన్‌ సహా మరికొన్ని జిల్లాల్లోని అనుమానితుల నివాసాల్లో దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. గతవారం కూడా ఎన్‌ఐఏ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    125
    Shares
  • 125
  •  
  •  
  •  
  •