జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

బిఎస్‌ఎఫ్‌లో 269 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!!

కేంద్ర హోం శాఖ పరిధిలోని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభంకానుందని, ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, మహిళలు సైతం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని బిఎస్‌ఎఫ్‌ అధికారులు సూచించారు. మొత్తం 269 పోస్టులను భర్తీ చేయనుండగా మెట్రిక్యుల్యేషన్‌ లేదా దానికి సమానమైన కోర్సు చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని అధికారులు చెప్పారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలని వారు పేర్కొన్నారు.

మిగిలిన వివరాలు:
పురుషులు- 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలని తెలిపారు. 85 సెంటీమీటర్ల ఛాతి కలిగి ఉండాలని వారు చెప్పారు. శారీరక దారుఢ్యం, అకడమిక్‌ మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకునే వారు https://bsf.gov.in/ వెబ్ సైట్ లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •