టెక్నాలజీ (Technology) వార్తలు (News)

పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేట్‌ వద్ద కొనసాగుతున్న మరమ్మత్తులు!!

పులిచింతల ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా రావడంతో డ్యాంలో విరిగిన గేటుకు మరమ్మతు పనులు మందకొండిగా కొనసాగుతున్నాయి. జలాశయంలో నీటిమట్టం తగ్గితేనే గేటును అమర్చేందుకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టులోని 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. మరోవైపు సాగుకు ఉపయోగించుకోవాల్సిన నీరంతా కడలిపాలవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది.

దీంతో కనిష్ట స్థాయికి అంటే 5.28 టీఎంసీలకు పులిచింతల నీటిమట్టం చేరుకోవడంతో తక్షణమే విరిగిన గేట్‌ స్థానంలో ఎమర్జెన్సీ గేటు ఏర్పాటు పనులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రానికల్లా స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పనులు విజయవంతంగా పూర్తయితే పులిచింతల నుంచి రెండు రోజులుగా వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని నిలిపివేసే అవకాశం ఉంది. తిరిగి సాగర్‌ నుంచి నీటితో పులిచింతల జలాశయం నింపేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఏమవుతుందో చూడాలి!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •