జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

పునః ప్రారంభమైన తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌!!

తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ లో ఎక్కువ మంది ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఐఆర్‌సిటిసి నడుపుతున్న ఈ తేజాస్‌ రైలు 2019 అక్టోబరులో ప్రారంభం కాగా కోవిడ్‌ కారణంగా ఇన్నాళ్లు రద్దయింది. మరలా ఇంతకాలానికి తిరిగి శనివారం పున: ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో తిరిగి అహ్మదాబాద్‌-ముంబై,లక్నో-న్యూఢిల్లీల మధ్య తేజాస్‌ రైలు రాకపోకలు సాగించనుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అత్యంత వేగంగా నడిచే ఈ రైలు ప్రయాణికులకు ఉచితంగా రూ.25 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు.

78 సీట్ల సామర్ధ్యం ఉన్న ఎసి ఛైర్‌ కార్‌ బోగీలో ప్రయాణికులకు నాణ్యత ఉన్న ఆహారాన్ని అందజేస్తారు. ఈ రైలులో ఆర్వో వాటర్‌ ఫిల్టరుతోపాటు ప్యాకేజేడ్‌ వాటర్‌ బాటిళ్లను కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •