క్రైమ్ (Crime) వార్తలు (News)

స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్‌ కలకలం!!

తెలంగాణలోని నిర్మల్‌ పట్టణంలోని దివ్యానగర్‌లో తన్వి అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న స్థిరాస్తి వ్యాపారి విజయ్ చందర్ దేశ్‌పాండేను ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం 7గంటల సమయంలో కిడ్నాప్‌ చేశారు. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఆయనను లిఫ్ట్‌ నుంచి బలవంతంగా లాక్కొని కిందికి వచ్చి అపహరిస్తుండడంతో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడి అతడిని లాక్కెళ్లారు. ఈ విషయంపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా గంజాల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల వివరాలు తెలియడంతో నిందితులు హైదరాబాద్ వైపు వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలోని పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టగా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఒక వాహనం, తూప్రాన్‌ వద్ద మరో వాహనం పట్టుబడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో సంగారెడ్డికి చెందిన కృష్ణారావును ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •