వార్తలు (News)

కోయంబేడు మార్కెట్‌లో తగ్గిన కూరగాయల ధరలు!!

కోయంబేడు మార్కెట్‌లో వివిధ రాష్ట్రాల నుంచి శనివారం ఉదయం 300 లారీలలో కూరగాయలు దిగుమతి అయ్యాయి. ఆడి అమావాస్య, ఆడిపూరం వేడుకల సందర్భంగా కూరగాయల అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయని వ్యాపారులు భావించగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనాలయాలన్నీ మూసివేయడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు శుక్రవారం నుంచే ఈ మార్కెట్‌లో చిల్లర వ్యాపారాలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌లో టన్నుల కొద్దీ కూరగాయల నిల్వలు పేరుకుపోయినా కారణంగా మార్కెట్‌లో కూరగాయల ధరలు తగ్గాయి. శుక్రవారం వరకు బీన్స్‌ కేజీ ధర రూ.20గా వుండగా, ప్రస్తుతం కేజీ బీన్స్‌ను రూ.15కు విక్రయిస్తు న్నారు.

ప్రస్తుతం ఆ మార్కెట్‌లోని కూరగాయల ధరలు పది నుంచి పదిహేను రూపాయల వరకూ తగ్గాయని, కేజీ వంకాయలు రూ.15, టమోటా రూ.15, ఆంధ్రా ఉల్లిపాయలు రూ.15, చిన్న ఉల్లిపాయలు రూ.24, బంగాళాదుంపలు రూ.17కు విక్రయిస్తున్నారు. ఇదేవిధంగా కేజీ బీట్‌రూట్‌ రూ.25, చిక్కుడు కాయలు రూ.20, పొట్లకాయలు రూ.20కు విక్రయిస్తున్నారు. ఆదివారం ఈ కూరగాయల ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టుగా వ్యాపారాలు భావిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •