వార్తలు (News)

రాజధాని అమరావతి ప్రాంతంలో ఆంక్షలు!!

అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు పూర్తయిన సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునివ్వడంతో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. దీంతో రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఉద్యమకారులు చేపట్టనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అమరావతి ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. పెదపరిమి వద్దే మీడియా ప్రతినిధుల వాహనాలను నిలిపివేశారు. మీడియాకు పోలీసులు సహకరించాలని ఎస్పీ విశాల్‌ గున్నీ కోరారు.

మరోవైపు విజయవాడ- అమరావతి మార్గంలోనూ, ప్రకాశం బ్యారేజీ సహా కరకట్టపై 4 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే విడిచిపెడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •